Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Telangana గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..

by CVR NEWS
గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు

గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తైన వెంటనే జీహెచ్‌ఎంసీకి ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది.
పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్‌ను జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లుగా విభజించిన నేపథ్యంలో కొత్త ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు.అక్టోబర్ రెండో వారానికి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం కొత్త డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయనున్నారు.ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఖరారు ప్రక్రియ పూర్తైన తర్వాత నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisements

You may also like

Our Visitor

041212
Total views : 214651

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: