Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

by CVR NEWS
అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. యోగాంధ్ర -2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిలో 25 వేల మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ వంతెనపై యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న నిర్వహిస్తారు. అలాగే అదే రోజు జిల్లా కేంద్రాల్లో 1000 మందితో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో నిర్వహించాలని సీఎం సూచించారు. మొత్తంగా కలిపి కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్దం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది ట్రైనర్లకు అందనంగా మరో లక్ష మందిని ట్రైనర్లుగా చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ఒక జిల్లా ఒక థీమ్ తో 14 రోజుల యోగాంధ్ర నిర్వహిస్తారు. జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణకు జిల్లాకు రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018717
Total views : 89240

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.