Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

by CVR NEWS
హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణలో పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ ను తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల పురోగతిని, బడ్జెట్ ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఖర్గేకు వివరించారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం, ప్రభుత్వ-పార్టీ సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో.. చేపట్టాల్సిన భవిష్యత్ కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. అలాగే కేబినెట్ విస్తరణ, కొందరు మంత్రుల మార్పు, పోర్ట్ ఫోలియోల మార్పు విషయాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ వారంలోనే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో కూడా ఈ అంశంపై చర్చించి.. జూన్ రెండోవారంలో కేబినెట్ విస్తరణ చేపడుతారని తెలుస్తోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: