అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు, సీఆర్డీఏ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులు, అభివృద్ధి ప్రాజెక్టులు , భవిష్యత్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చ జరిగింది. అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడం, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అభివృద్ధిని సమగ్ర ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
#చంద్రబాబునాయుడు #ఆంధ్రప్రదేశ్ #టూరిజం #పెట్టుబడులు #ఇన్వెస్ట్మెంట్స్ #డెవలప్మెంట్ #APPolitics #TourismProjects #BreakingNews
వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్ధక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ‘ఫార్మ్ టూ హోమ్’ విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరేలా కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటూ మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు సమీపంలో ‘కోకో సిటీ’ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు జులైలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా పులివెందులలో నిర్మాణంలో ఉన్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆక్వా రంగానికి ప్రోత్సాహంగా కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. రైతులు, మత్స్యకారులు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు పండించిన పంటలను, ముఖ్యంగా కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేర్చేందుకు ఫార్మ్ టు హోమ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, ప్రాంతాల వారీగా పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతికూల వాతావరణంలోనూ రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని, ఈ విధానంలో విజయం సాధించిన రైతుల అనుభవాలను వినియోగించుకోవాలని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ఆన్లైన్లో రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతు బజార్లలో ప్రకృతి సేద్య ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి కొరత ఉన్నచోట్ల పీఎండీఎస్-హాఫ్ మూన్ పద్ధతుల్లో సేద్యం చేపట్టాలన్నారు. రాయలసీమను ఉద్యానవన హబ్‌గా మార్చేందుకు రూ.40 వేల కోట్లతో పూర్వోదయ పథకం కింద సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, గోదాముల వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్టు సీఎం వివరించారు. దీనికి తోడు 60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు. జూలై నాటికి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నిర్మాణాన్ని పూర్తి చేసి, వినియోగంలోకి తెచ్చేందుకు తక్షణమే 3 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. రాయలసీమలో పండే అరటికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు క్లస్టర్ల వారీగా ప్రణాళికలు రూపొందించి, రైతు సాధికార సంస్థ ద్వారా హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అందించాలని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు రహదారులు, భవనాలు, రవాణాశాఖపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో అమోదం తెలిపిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో అమోదం తెలిపిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసారు. 2029 నాటికి 50 వేల హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. పర్యాటకులకు 10 వేల హోం స్టేలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని స్పష్టం చేసారు. విశాఖ, తిరుపతిలో అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. పర్యాటక శాఖపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ సహా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం తెలియజేసిన టూరిజం ప్రాజెక్టులు వేగంగా ఏర్పాటు అయ్యేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు వచ్చేలా చూడాలని సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి కూడా రాజమహేంద్రవరం సహా వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోం స్టేల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. హోం స్టేల నిర్వహణకు సంబంధించి రేటింగ్ కూడా పెట్టాలని దిశానిర్దేశం చేశారు. అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు, గాంధీవనం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం 10-15 ప్రాంతాల్లో కారావాన్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. కారావాన్లను పార్కింగ్ చేసుకుని కుటుంబంతో సురక్షితంగా ప్రకృతిని ఆస్వాదించేలా ఆయా పార్కుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్స్ పీరియన్స్ కేంద్రాల వద్ద కూడా ఈ తరహా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
తిరుపతి, విశాఖలలో అమ్యూజ్ మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం సూచనలు జారీ చేశారు. అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టులను 2026 మే నాటికి సిద్ధం చేయాలని అన్నారు. దీనికి సంబంధించి మరో రూ.663 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పర్యాటక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరఘాట్‌ను ఆగస్టు నాటికి, హావ్ లాక్ బ్రిడ్జిపైకి పర్యాటకులను అనుమతించేలా ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.





Total views : 200901