Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh ఈవీ బస్సులు, ప్రజా రవాణాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

ఈవీ బస్సులు, ప్రజా రవాణాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

by CVR NEWS

ఏపీ సీఎం చంద్రబాబు రహదారులు, భవనాలు, రవాణాశాఖపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: