Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ

by CVR NEWS

ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించింది. నగరంలో అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగాల్లో చేపట్టిన సంస్కరణల వల్ల అమరావతి భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి అమరావతి ఒక ప్రధాన గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాల విస్తరణతో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి సమతుల్య అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు ఆయన వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: