Telangana:
తెలంగాణలో మార్చి నెలలోనే భానుడి ప్రతాపం మొదలైంది. ఇప్పటికే ఎండవేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఇంకా ఎండలు ముదురుతాయని భారత వాతావరణ సంస్థ చెబుతోంది. రాగల ఐదు రోజుల్లో మరో 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుందని ఐఎండీ(IMD) వెల్లడించింది. ఉదయం పూట పొగ మంచు ఉన్నప్పటికీ, పగటి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతాయని వివరించింది. రాష్ట్రంలో ఎండలపై ఇప్పటికే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని ఐఎండీ పేర్కొంది. తెలంగాణలో మార్చి నాటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్(41 degrees Celsius) ను తాకడంతో, ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: హైదరాబాద్ – కరీంనగర్ ఎలివేటెడ్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి