కరీంనగర్(Karimnagar), నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా భూమిని ఆక్రమించినందుకు అప్పటి ఎమ్మార్వో(MRO) తో సహా నలుగురు పై కేసు నమోదు. ఈ కేసు లో A1గా ఉన్న మాజీ చింతకుంట సర్పంచ్ , ప్రస్తుత కొత్తపల్లి జడ్పీటీసీ భర్త పిట్టల రవీందర్(Pittala Ravinder) రిమాండ్ చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు.
పామ్ రాజ్ దేవి దాస్ రావు హైదరాబాద్ మాదాపూర్ లో నివాసముంటున్నారు. వారి తండ్రి పామ్ రాజ్ గోవిందా రావు కు 1954 వ సంవత్సరం కాస్రా పహాణి ద్వారా చింతకుంట గ్రామ శివారు సర్వే నెంబర్ 106 లో ఐదు ఎకరాల 08 గుంటల భూమి ఉండేదని, అట్టి భూమిలో అందరికి అమ్ముకోగా 20 గుంటల భూమి మిగిలి ఉండేదని తెలిపాడు.
Follow us on :Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తప్పుడు పత్రాలు(Fake Documents) అడ్డుపెట్టుకుని దౌర్జన్యం
ఈ 20 గుంటల భూమి ధరణి తన తండ్రి పేరే ఉండేదని పహాణి లో మాత్రం పేరు టాంపర్ అయి అక్రమంగా న్యాలమడుగు చిన్న వీరయ్య పేరు వచ్చేదని పేర్కొన్నారు. దీనిని గ్రహించిన అప్పటి సర్పంచ్ అయిన పిట్టల రవిందర్ కాజేయాలనే దుర్బుద్ధితో వీరయ్య పేరుగల మరో వ్యక్తి కుమారుడి రాజయ్య పేరు పై అప్పటి ఎమ్మార్వో మోహన్ రెడ్డి ద్వారా కుమ్మక్కై తప్పుడు విరాసత్ ద్వారా ధ్రువ పత్రాలు చేయించారని, రాజయ్య నుండి ముందుగానే నిర్ణయించుకున్న పథకం ప్రకారం గడ్డం ఆది రెడ్డి పేరున 2009 వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించారని, ఆది రెడ్డి నుండి 2010 వ సంవత్సరంలో పిట్టల రవీందర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని అట్టి భూమి తనదేనని ,
ఈ తప్పుడు పత్రాలు అడ్డుపెట్టుకుని దానిని దౌర్జన్యంగా , అక్రమంగా దున్నుతున్నాడని , అడ్డుగా వెళ్తే ఆ భూమి తనదేనని , ఇంకోసారి మీరు వస్తే చంపేస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు పామ్ రాజ్ దేవి దాస్ రావు ఇచ్చిన కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఇన్స్పెక్టర్ ఏ. ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో తెలిపిన భాధితుడు వివరాలు నిజమేనని నిరూపణ అయినందున నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి దుర్బుద్ధితో భూమిని కాజేయాలని ప్రయత్నించిన మరియు సహకరించిన అప్పటి ఎమ్మార్వో తో సహా నలుగురిపై
- పిట్టల రవీందర్.
- గడ్డం ఆది రెడ్డి.
- న్యాలమడుగు రాజయ్య.
- మోహన్ రెడ్డి (అప్పటి ఎమ్మార్వో ) లపై పలు సెక్షన్ల
467, 468, 471, 409, 420, 447, 427, 341, 506, 120- b r /w 34 IPC కింద కేసు నమోదు కాగా, మాజీ చింతకుంట సర్పంచ్, ప్రస్తుత కొత్తపల్లి జెడ్పిటిసి భర్త అయిన పిట్టల రవీందర్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, నిందితుడికి 14 రోజుల రిమాండు విధించి జైలుకు తరలించారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి