కరీంనగర్, తప్పుడు పత్రాలు(Fake Documents) సృష్టించి ఒకే భూమిని పలువురికి అమ్మి అమాయక ప్రజలయిన విక్రయ దారులను మోసం చేసి బెదిరింపులకు గురిచేసిన ఘటనలో 7 వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాష్ తో సహా ఐదుగురిపై కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు.
తిమ్మాపూర్(Thimmapur) మండలం మొగిలిపాలెం కు చెందిన వంతడపుల సంపత్ అనే వ్యక్తి తొమ్ముడ్రు నర్సింహారావు వద్ద 1998 లో ప్లాటును ఖరీదు చేసాడని, తొమ్ముదురు నర్సింహారావు 1998 లో సర్వే నంబర్లయిన 159/F లో 10 గుంటలు , 161/F లో 09 గుంటలు . 162/F లో 14 గుంటలు మొత్తంగా 33 గుంటలు కరీంనగర్ జిల్లా వల్లంపహాడ్(Vallamphad) లో గల భూమిని ఖరీదు చేసి ప్లాట్ లుగా విభజించి పలువురికి విక్రయించాడని అందులో తాను కూడా ఒక ప్లాట్ ను ఖరీదు చేసానని తెలిపాడు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదిలా ఉండగా తొమ్ముడ్రు నరసింహారావు పలువురికి విక్రయించిన భూమిని అక్రమంగా `విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయించుకుని, తిరిగి అట్టి భూమిని కరీంనగర్ గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ హఫీజ్ కు 33 గుంటలు గుత్తాగా విక్రయించగా, అబ్దుల్ హఫీజ్ అందులో నుండి సర్వే నెంబర్ 159/F లో గల 10 గుంటల భూమిని కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ కి చెందిన 7వ డివిజన్ కార్పోరేటర్ భర్త అయిన ఆకుల ప్రకాష్ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడన్నారు.
అసలు విక్రయదారులను భూమి పైకి వెళ్లనివ్వకుండా బెదిరింపులు | Land Scam
తిరిగి ఇట్టి భూమిలో నుండి 03 గుంటలు , కరీంనగర్ కట్టరాంపూర్ కు చెందిన ఉప్పు సురేష్ కు, కరీంనగర్ వావిలాలపల్లికి చెందిన కట్ట రమ్యలు కావాలనే దురుద్దేశంతో తక్కువ ధరకు కొనుగోలు చేసి అసలు విక్రయదారులైన వారిని భూమి పైకి వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విచారణలో తెలిపిన భాధితుడు వివరాలు నిజమేనని నిరూపణ అయినందున నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి దుర్బుద్ధితో భూమిని కాజేయాలని ప్రయత్నించిన మరియు సహకరించిన ఐదుగురిపై
- తొమ్ముడ్రు నరసింహారావు
- ఆకుల ప్రకాష్.
- మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్
- ఉప్పు సురేష్
- కట్ట రమ్య. లపై పలు సెక్షన్ల 467, 409, 420, 447, 341, 506, 120-B, 109 r/w 34 ఐపీసీ, Sec 3(1), 3(2) (va) of SC ST (PoA) Amendment act -2015 కింద కేసు నమోదు కాగా, A2 గా వున్న 7 వ డివిజన్ కార్పొరేటర్ భర్త అయిన ఆకుల ప్రకాష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా, నిందితుడికి 14 రోజుల రిమాండు విధించి జైలుకు తరలించారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి