పీవీ నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు..
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో భారతరత్న అవార్డుల(Bharat Ratna Awards) ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పీవీ నరసింహారావు(PV Narasimha Rao) తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు(Prabhakar Rao) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా భారతరత్న అవార్డు అందుకున్నారు. చరణ్‌సింగ్ తరపున ఆయన మనువడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ భారతరత్న అందుకున్నారు.
ఇది చదవండి: సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్..!
రేపు రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఎల్‌కే అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. పలు రంగాల్లో విశేష కృషి చేసిన ఐదుగురికి ఇటీవలే కేంద్రం భారతరత్న అవార్డులను ప్రకటించింది. భారత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ, బీహార్ మాసీ సీఎం కర్పూరీ ఠాకూర్, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి