అమెరికా(America) రాయబారి ఎరిక్ గార్సెటీ కీలక వ్యాఖ్యలు..
అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్(India)లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ(Eric Garcetti) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాంటి భారీ దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, విద్యార్థులు నిత్యం అప్రత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో నేను మాట్లాడాను. వారి పరిస్థితికి నా హృదయం ద్రవించిందని తెలిపారు.
ఇది చదవండి: UNSC : గాజాలో కాల్పుల విరమణ..!
ఇలాంటి విషయాలను మేము సీరియస్‌గా తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపిన ఆయన బాధితులకు న్యాయం లభించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అయితే దాడుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ దిశగా యూనివర్సిటీల్లోని వనరులను వినియోగించుకోవాలని ఎరిక్ కోరారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి