కవిత(Kavitha) బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 4కు వాయిదా..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi Liquor Scam Case)లో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 4కు వాయిదా పడింది. కవిత తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్‌లో కవిత పేరు లేదని అసలు ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అరుణ్‌పిళ్లై తొమ్మిసార్లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కవిత పేరు చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇది చదవండి: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు
మొదటి, సప్లిమెంటరీ చార్జ్‌షీట్లలో కవిత పేరు లేదన్నారు. మొదటి నుంచి కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నా కవితను అరెస్ట్ చేశారని వాదనలు వినిపించారు సింఘ్వీ. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు వెల్లడించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 4కు వాయిదా వేసింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి