ఇరాన్(Iran) భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని రాత్రి మిలిటెంట్ గ్రూప్(Militant Group) జైష్ అల్-జుల్మ్(Jaish al-Adl) సభ్యులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. అదేవిధంగా రాస్క్ కౌంటీలోని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ -IRGC కి చెందిన మిలిటరీ పోస్ట్‌తో పాటు ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయం, చబహార్ కౌంటీలోని కోస్ట్‌గార్డ్ పోలీస్ స్టేషన్‌పై గ్రూప్ జైష్ అల్-జుల్మ్ కాల్పుల మోత మోగించారు.
ఇది చదవండి: Joe Biden | ఇజ్రాయెల్‌పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం..!
ఈ క్రమంలోనే భద్రతా దళాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ మారణహోమంలో 18 మంది తీవ్రవాదులు, 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పేలుడు పదార్థాలను కూడా దుండగులు తమ దుస్తుల్లో పెట్టుకొచ్చారంటూ ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ మహ్మద్ పక్‌పూర్ వెల్లడించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి