Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home International Joe Biden | ఇజ్రాయెల్‌‌పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం..!

Joe Biden | ఇజ్రాయెల్‌‌పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం..!

by Satya
Joe Biden

ఇజ్రాయెల్ వైమానిక దాడిపై జో బైడెన్(Joe Biden) దిగ్బ్రాంతి వ్యక్తం..

గాజా(Gaza)లో సైనిక చర్య పేరిట భీకర దాడులతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌‌(Israel)పై అగ్రరాజ్యం అమెరికా(America) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గాజాలో పౌరుల రక్షణ కోసం ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోలేదని అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బైడెన్ ఈ విధంగా ఘాటుగా స్పందించారు.

ఇది చదవండి: అమెరికాలో ఘోర ప్రమాదం..!

ఇజ్రాయెల్ వైమానిక దాడిపై బైడెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు స్వచ్ఛంధ సేవా సంస్థ సహాయకులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని అన్నారు. మృతులంతా యుద్ధ పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్నవారికి సహాయాన్ని అందించినవారేనని అన్నారు. ధైర్యంగా, నిస్వార్థంగా సాయం చేసినవారు మృతి చెందడం తీరని లోటు అని బైడెన్ వ్యాఖ్యానించారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే …
డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.
కెనడాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా …
కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: