సనత్ నగర్ జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్(GHMC Swimming Pool) లో పడి బాలుడు మృతి
కార్తికేయ అలియాస్ సోను (12) స స్థానిక వశిష్ఠ పాఠశాలలో 5వ తరగతి ఫైనల్ పరీక్షలు రాస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కార్మిక సంక్షేమ. కేంద్రం ఆవరణలోని మైదానానికి మరో నలుగురు మిత్రులతో కలిసి క్రికెట్ ఆడేందుకు కార్తికేయ వెళ్లాడు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుండగా బాల్ పగిలిపోయింది. స్థానికంగా క్రికెట్ ఆడే పిల్లల బాల్స్ ఈత కొలనులో పడుతుంటాయని, అక్కడికి వెళితే మరో బాల్ దొరకవచ్చని చెప్పారు. దీంతో సమీపంలోని ఓ చెట్టెక్కి, ప్రహరీ దూకిన కార్తికేయ ఈత కొలనులోకి వెళ్లాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈత కొలను గేటు మూసి ఉండటం, కార్తికేయ ఎంతకూ తిరిగి రాకపోవడంతో మిత్రులు చాలాసేపు నిరీక్షించారు. గోడ దూకి కొలనులోకి వెళ్లిన కార్తికేయ రాకపోవడంతో తోటి మిత్రులు ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తల్లి, ఇతర కుటుంబ సభ్యులు వచ్చి కొలను గేటు తెరిపించి చూశారు. నీటిలో తేలుతున్న కార్మికేయ కనిపించాడు. అయితే కార్తికేయ తన టీషర్టు విప్ప పక్కన బెట్టిన బెట్టి కొలనులో కనిపించిన బంతి కోసం నీటిలో దిగినట్టు అనుమానిస్తున్నారు. దీంతో అతన్ని హుటాహుటిన సనత్నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్ధి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు సనతనగర్(Sanat Nagar) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలు
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్య
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి