తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ(Telangana)లో పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించింది. దీంతో పాటు వడగాలుల ముప్పు కూడా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు నిప్పులు చిమ్మాడు. తీవ్రమైన వేడిమితో ప్రజలు అల్లాడిపోయారు. హైదరాబాద్(Hyderabad) లో పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, ప్రజలు రోడ్లపైకి రావడానికే భయపడ్డారు. రహదారులపై సంచారం తగ్గింది.
ఇది చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఎదురుదెబ్బ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని అనేక మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలు
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలి
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.