తాను తీహార్ జైల్లో 48 సార్లు భోజనం చేస్తే కేవలం మూడుసార్లు మాత్రమే మామిడి పండ్లు తిన్నానని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పష్టం చేశారు. జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో ఉన్న తనకు ఇంటి నుంచి మూడుసార్లు మామిడిపండ్లు వచ్చాయన్నారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ బెయిల్ పొందేందుకు ఉద్దేశ్యపూర్వకంగా మామిడిపండ్లు, ఆలూ, స్వీట్లు తింటున్నారని విచారణ సంస్థ కోర్టుకు తెలిపింది. దీంతో కేజ్రీవాల్ తరఫున ఈరోజు సీనియర్ అడ్వోకేట్ అభిషేక్ మను సింఘ్వీ భోజనానికి సంబంధించిన వివరాలను సమర్పించారు. జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఛాయ్ తాగినట్లు ఈడీ చెప్పిందని… కానీ షుగర్ లేకుండానే కేజ్రీవాల్ దీనిని తీసుకున్నట్లు తెలిపారు. జైల్లో ఉన్నంత మాత్రాన ఇంకా నేరస్తుడు కాదని… ఖైదీ అయితే హక్కులు ఉండవా అని సింఘ్వీ ప్రశ్నించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్కౌంటర్..!
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారం
- JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..
- రేపు సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి