ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం(Chhattisgarh State), బస్తార్(Bastar)లోని కాంకేర్ లో భద్రత బలగాలకు, మావోయిస్టుల(Maoists)కు భారీ ఎన్‌కౌంటర్(Encounter) చోటుచేసుకుంది. కాంకేర్ జిల్లా చోటే బడియా పోలిస్ స్టేషన్ పరిధిలోని కల్పర్ అడవిలో భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులకు, భద్రత బలగాలకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
ఇది చదవండి: వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..
భద్రత బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు దళ కమాండర్ శంకర్ రావు మృతి చెందినట్లు ఎస్పీ కళ్యాన్ ఎలిసెలా ధృవీకరించారు. కాగా దళ కమాండర్ శంకర్ రావు పై 25 లక్షల రివార్డు ఉంది. ఈ ఎన్ కౌంటర్‌లో ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు బీఏస్ఏఫ్ జవాన్లు గాయపడినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్ జరిగిన ఘటన స్థలం నుండి 4 ఏకే 47, రైఫిల్స్, భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 56907