లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్‌లోనే ఆ పార్టీ 26 సీట్లను దక్కించుకుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మూడవ దశలో అసోం- 4 సీట్లు, బీహార్-5, ఛత్తీస్‌గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ -10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2లలో పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం13 వందల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు.
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
- JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది.…
- రేపు సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం…జార్ఖండ్‌లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 28న హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.