తెలంగాణలో రైతుభరోసాకు బ్రేక్ పడింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్ సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. మే9 లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఎన్నికల ప్రచారసభల్లో సిఎం ప్రస్తావించారని వచ్చిన ఫిర్యాదులతో ఈసీ ఈ ఆదేశాలు జారీచేసింది. రైతుభరోసా పధకం కింద ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ నెల 8లోపు ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే… రైతుభరోసాకు నిధులు విడుదల చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన చేయగానే ప్రభుత్వం నిధుల విడుదలకు చకచకా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.2వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రైతు భరోసా నిధులు ఆపేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.