ఉత్తరాఖండ్(Uttarakhand) లోని బద్రీనాథ్ ఆలయం(Badrinath Temple) తలుపులు తెరుచుకున్నాయి. శీతాకాలం మంచుతో ఈ ఆలయం కప్పబడి ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ లలో శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ ల తలుపులు అక్షయ తృతీయ రోజునే తెరుచుకున్నాయి. భద్రీనాథ్ ఆలయాన్ని పూలతో అలంకరించారు. హిందూవులు సందర్శించే తీర్ధయాత్రల్లో బద్రీనాథ్ యాత్ర ఒకటి. ఇది ప్రధానంగా విష్ణు భక్తులచే నిర్వహించబడుతుంది. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో భద్రీనాథ్ ప్రముఖ పట్టణం.
సముద్రమట్టానికి మూడు వేల 133 మీటర్ల ఎత్తులో భద్రీనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ తీర్ధయాత్ర సాధారణంగా ఏప్రిల్ చివరలో లేదా మే నెల మొదటివారంలో ప్రారంభమవుతుంది. నవంబర్ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయ్యింది. రెండు రోజుల క్రితం శ్రీ కేదార్నాథ్, శ్రీ గంగోత్రి, శ్రీ యమునోత్రి ధామ్ లు సందడిగా మారాయి. తొలిరోజు ఒక్క భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి రికార్డు స్తాయిలో కేదార్ నాథ్ ధామ్ ను సందర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
- JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది.…
- రేపు సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం…జార్ఖండ్లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 28న హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.