చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ , మత్తు పదార్థాలు ప్రజలు ఎవ్వరూ వినియోగించరాదని జిల్లా కలెక్టర్ ద్యానచంద్ర హెచ్ఎం, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు.బుధవారం ఉదయం స్థానిక ప్రకాశం రోడ్డు నుండి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్ దుర్వినియోగం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణ కు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు వాటి అక్రమ రవాణ అరికట్టడం పై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ర్యాలీ ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలుఈ కార్యక్రమo ముఖ్య ఉద్దేశ్యం అనధికారిక డ్రగ్స్ , మత్తు పదార్థాల వినియోగం వల్ల ప్రజలకు ఏర్పడే దుష్ప్రభావాలపై మరియు వాటి అక్రమ రవాణా పై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. రోగాలకు వాడే మందులను వైద్యుల సూచనల మేరకు ఆరోగ్య రీత్యా వాడాలని వాటికి బానిసలుగా మారితే వాటివల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని అన్నారు. అలాగే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ బారిన పడి యువత వారి బంగారు జీవితాన్ని పాడు చేసుకోరాదని సూచించారు. స్కూల్స్ , కాలేజీలలో ఎవరైనా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉన్నట్లు తెలిస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మాదక ద్రవ్యాల వాడకం నుండి వారిని బయటకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు , స్వచ్చంద సంస్థలు మరియు ఇతర సంఘాలు సమభాగంగా మత్తుకు బానిసలైన వారి కేసులు తమ ద్రుష్టికి వస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వాటి వినియోగం నుండి బయటకు తీసుకుని రావడానికి కృషి చేయాలని అన్నారు. స్కూల్, కాలేజీల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి మత్తు నుంచి విముక్తి కలిగించుట కొరకు సందేహాలు, సూచనల కొరకు దగ్గరలోని రీహ్యాబిలిటేషన్ సెంటర్స్ ను సంప్రదిస్తే వీటిపై తగు సూచనలు, కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరమని శిక్షార్హులని అన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అని,యువత మత్తుకు బానిస కాకుండా ముందుగానే అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.