జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ను పోలీసులు 5వ నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదార్లకు సహకరించడంతో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్‌వీ కాశీ విశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్ శివ రామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
కాగా వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ ఎగవేత ద్వారా ఏకంగా వెయ్యి కోట్లకుపైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. జీఎస్టీ కుంభకోణంలో 5వ నిందితుడిగా మాజీ సీఎస్ సోమేశ్. మరో 11 ప్రైవేటు సంస్థలు దాదాపు రూ. 400కోట్లు పన్ను చెల్లింపులు ఎగవేసినట్టు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు మానవ వనరులను అందించే బిగ్‌లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏమాత్రం ట్యాక్స్ కట్టకుండానే ఏకంగా 25.51కోట్ల ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకుందని, అవకతవకలు జరిగాయని తేలిన నేపథ్యంలో అంతర్గతంగా విచారణ జరిపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాణిజ్యపన్నులశాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ల్లో అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం సర్వీస్‌ప్రొవైడర్ చేయాల్సిన పని.కానీ బిగ్‌లీప్ టెక్నాలజీస్ అక్రమాలను ఐఐటీ హైదరాబాద్ అందిస్తున్న ఐఐటీ హైదరాబాద్ స్క్రూటినీ మాడ్యూల్ కూడా గుర్తించలేకపోయిందని వివరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి