జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తన ఆలోచనలు, కూటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశానిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం అమలు చేయాలనుకున్న బహుముఖ వ్యూహాన్ని కలెక్టర్లు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో చర్చించి దాని అమలుకు కార్యాచరణను ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రిగా 1995 నాటి మోడల్‌ను అమలు చేస్తానని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.నేడు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ఈ నేపథ్యంలో పరిపాలనలో గుణాత్మకమైన మార్పు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు అంటే కేవలం అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తారన్న విమర్శలకు దీటుగా బదులివ్వడానికి సన్నద్ధమవుతున్నారు. పేదలే లక్ష్యంగా సంక్షేమం అందించేలా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతీ పేద కుటుంబంలోని లబ్ధిదారులకు ఒకటో తేదీనే ఫించను సొమ్ము అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇలా కుటుంబంలో వ్యక్తిని ఒక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేలా సంక్షేమ కార్యాచరణను రూపొందించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి