ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను దేశ రాజధానిలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు గురైన కవిత ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక. కవిత వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతకుముందు, జులై 16న కవిత జైల్లోనే అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆమెకు జ్వరం రావడంతో పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్లో గల దీనదయాళ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. కవిత గత ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆలోగా ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో 23వ తేదీలోగా రిజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరఫు న్యాయవాదులను ఆదేశించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి