హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌లో మరోసారి దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. రాజధాని బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో ఇజ్రాయెల్ సేనలు దాడి జరిపాయి. సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్న ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపింది. బచౌరా ప్రాంతంలో జరిగిన ఈ దాడి లెబనాన్ ప్రభుత్వాన్ని నిర్వహించే ప్రదేశానికి దగ్గరలోనే జరగడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో ఆరుగురు చనిపోయారు.
బీరుట్‌పై కచ్చితమైన వైమానిక దాడిని జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. భారీ పేలుడు శబ్దాలు విన్నామని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు బీరుట్ నగర దక్షిణ శివారు ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ముందుగా హెచ్చరికలు జారీ చేసిన అనంతరం పలు దాడులు జరిగాయి. అయితే సెంట్రల్ బీరుట్‌లో జరిగిన దాడి విషయంలో మాత్రం ఇజ్రాయెల్ బలగాలు హెచ్చరికలు చేయలేదు. కాగా బీరుట్ నగరంలో ఇజ్రాయెల్ దాడులు జరపడం 2006 తర్వాత ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలావుంచితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరో వీడియోను విడుదల చేశారు. ‘‘ప్రపంచ స్థిరత్వానికి హానికరమైన ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న కష్టతరమైన యుద్ధంలో పతాక స్థితిలో ఉన్నాం. ఇరాన్ మనల్ని నాశనం చేయాలనుకుంటోంది. కానీ అది జరగదు. మనమంతా కలిసి నిలబడతాం. దేవుడి సాయంతో కలసి కట్టుగా గెలుస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి