టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ. గత వారం రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై నేడు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను రాలేనని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. గత వారం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మాణిలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు గాను మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఈ కేసును పెట్టాడు. ఇక రామలింగం ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై విచారణకు హాజరుకావాల్సిందిగా.. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల ప్రకారం మంగళవారం వర్మ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే వర్మ ఏపీ హైకోర్ట్‌ను ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వర్మ క్యాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు వర్మ చేసిన వ్యాఖ్యల పట్ల పిటిషన్ కొట్టివేసింది. అలాగే అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
ఇదిలావుంటే నేడు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది వర్మ. అయితే, ఉదయం 10 గంటలకు తాను విచారణకు రాలేనంటూ ఆర్జీవీ పోలీసులకు మెసేజ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వాట్సాప్ లో ఆయన మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. తనపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులకు సహకరిస్తానని చెప్పిన ఆర్జీవీ.. తన వ్యక్తిగత పనుల కోసం నాలుగు రోజుల సమయం కావాలని కోరినట్లు తెలుస్తుంది. అనంతరం తాను తప్పుకుండా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీటాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ. గత వారం రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై నేడు విచారణకు హాజరుకావాల్సి ఉండగా..…
- రేపు జార్ఖండ్ లో రెండో విడత పోలింగ్రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు, జార్ఖండ్‌లో 38 స్థానాలకు రేపు జరిగే ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది.జార్ఖండ్‌లో ఆల్రెడీ ఒక దశ ఎన్నికలు పూర్తికాగా.. రెండో దశలో 38 స్థానాలకు…
- అయ్యప్ప దర్శనానికి 10 గంటలుశబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఇక, అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ…
- కాగ్ చీఫ్ గా తెలుగు ఐఏఎస్ కె.సంజయ్ మూర్తికంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి నియమితులయ్యారు. కాగ్‌కు చీఫ్‌గా ఓ తెలుగు వ్యక్తి నియమితులవడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్‌గా నియమించినట్టు కేంద్రం వెల్లడించింది. సంజయ్‌మూర్తి…
- రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాందేశంలో రిజర్వేషన్లపై 50శాతం పరిమితిని ఎత్తివేస్తాం అని, అంతేగాక కులగణన నిర్వహిస్తామని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన అతిపెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి