68
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద జాతీయ రహదారి పై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి చెట్టుని ఢీ కొట్టగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు, ఇప్పటికే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని , లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను కాపాడే ప్రయత్నాలు అవుతే చేస్తున్నారు, ఈ లారీ లో మృతి చెందిన వ్యక్తి లిఫ్ట్ అడిగి లారీ ఎక్కినట్టుగా సమాచారం, మృతుడు మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య గా గుర్తించిన పోలీసులు తమ బంధువులకు సమాచారం ఇచ్చారు, క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసే ప్రయత్నం లో ఏటూరునాగారం పోలీసులు ఉన్నారు.