జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి పోయిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముద్రించిన విద్యార్థి మేలుకో భవిష్యత్తు కాపాడుకో కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను ఏ విధంగా బ్రష్టు పట్టించారనే విషయంపై యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించడమే విద్యార్థి మేలుకో… భవిష్యత్ కాపాడుకో… కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తెలుగునాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారనడానికి రాష్ట్రంలో సుమారు 120 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అనేక కారణాలు చెప్పి సుమారు 42 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి దూరం చేశారన్నారు. ఇక ఇప్పటివరకు ఫీజు బకాయిలు చెల్లించలేదని పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. దేశం బాగుపడాలంటే విద్యార్థులతోనే సాధ్యమవుతుందని విద్యావ్యవస్థ బాగుండాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని విద్యార్థులందరూ మేలుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
జగన్ సిఎం అయ్యాక విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించారు..
62
previous post