69
చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ చికిత్స తోనే నయం అవుతుందని, ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. డి ఎం అండ్ హెచ్ ఓ ప్రభావతి దేవి మాట్లాడుతూ ఎయిడ్స్ హెచ్ ఐ వి అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుందని, అక్రమ సంబంధాలు డ్రగ్స్ కు బానిస కావడం, గర్భవతి అయిన తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుందని ఎయిడ్స్ రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిడ్స్ బాధితులకు ఏఆర్టి కేంద్రాలలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మాట్లాడుతూ ఎయిడ్స్ రాకుండా అవగాహన చర్యలు చేపట్టడం ఉత్తమమైన మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.