76
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అద్దంకి – నార్కెట్ పల్లి హైవే రహదారి ప్రక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతుడు రిక్షా కూలిగా, అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారాన్ని తెలియజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్యా.. ఆత్మహత్యా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.