ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా స్థిరీకరిస్తూ కేంద్రం లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టింది…

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల&period;&period; సాకారమయ్యే సమయం ఆసన్నమైంది&period; అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా స్థిరీకరిస్తూ కేంద్రం లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టింది&period; గత ప్రభుత్వ హయాంలో జరిగిన అస్పష్టతను తొలగిస్తూ&comma; విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది&period; లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సభ్యుల నుంచి భారీ స్పందన లభించింది&period; ఏపీ పునర్విభజన చట్టం 2014కు సవరణలు చేస్తూ&comma; అమరావతే రాజధాని అని స్పష్టం చేస్తూ కేంద్ర హోం శాఖ ఈ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టింది&period; ఇవాళ ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది&period; ఉభయ సభల ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;<p>వాస్తవానికి 2014 విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా గుర్తించినప్పటికీ&comma; గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో గందరగోళం నెలకొంది&period; దీనిపై రాజధాని రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు&period; భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చిక్కులు రాకుండా ఉండాలంటే&period;&period; అమరావతికి పర్మనెంట్ లీగల్ స్టేటస్ ఉండాలని చంద్రబాబు కూటమి సర్కారు భావించింది&period; రాష్ట్ర అసెంబ్లీలో అమరావతే ఏకైక రాజధాని అని ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది&period; కేంద్రం ద్వారా ఈ బిల్లును ఆమోదింపజేయడం వల్ల&comma; రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాజధానిని మార్చే అధికారం ఉండదు&period; ఇది అమరావతికి ఒక రక్షణ కవచం లాంటిది&period; ఈ చారిత్రక ఘట్టానికి పునాది ఏపీ అసెంబ్లీలోనే పడింది&period; రాష్ట్ర అభ్యర్థన మేరకు కేంద్రం తన బాధ్యతగా ఈ సవరణ బిల్లును ముందుకు తెచ్చింది&period; ఇవాళ రాజ్యసభలోనూ ఈ బిల్లు సులభంగా ఆమోదం పొందుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.