తిరుపతి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన ..

తిరుపతి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన

Advertisements

<p>ఏపీని పారిశ్రామికంగా&comma; సాంకేతికంగా అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది&period; ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ &&num;8216&semi;క్యారియర్ గ్లోబల్&&num;8217&semi; యూనిట్‌కు రాష్ట్ర ఐటీ&comma; మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు&period; ఈ ప్రాజెక్టు కోసం క్యారియర్ సంస్థ సుమారు వెయ్యి కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది&period; దీని ద్వారా ప్రత్యక్షంగా&comma; పరోక్షంగా దాదాపు 3&comma;000 మందికి ఉపాధి&comma; జీవనోపాధి అవకాశాలు లభించనున్నాయి&period;<br &sol;>&NewLine;క్యారియర్ కేవలం ఒక కంపెనీ కాదని&comma; ప్రపంచ శీతలీకరణ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మార్గదర్శి అని మంత్రి లోకేష్ ప్రశంసించారు&period; తన జీవితంలో కొనుగోలు చేసిన మొట్టమొదటి ఏసీ కూడా క్యారియర్ బ్రాండ్‌దేనని ఆయన గుర్తుచేసుకున్నారు&period; డేటా సెంటర్లను ఆకర్షిండమేకాదు&comma; వాటికి అవసరమైన పూర్తి తయారీ పర్యావరణ వ్యవస్థను &lpar;ఎకోసిస్టమ్&rpar; నిర్మించే హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు&comma; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉందని&comma; ఈ రేసులో ఏపీ ముందు వరుసలో నిలుస్తుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు&period; డేటా సెంటర్లకు అత్యాధునిక కూలింగ్ సిస్టమ్స్&comma; అధిక సామర్థ్యం గల చిల్లర్లు&comma; పవర్ ఎలక్ట్రానిక్స్&comma; ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటివి అత్యంత కీలకమని&comma; వీటికి అవసరమైన బలమైన సహాయక పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించామని వివరించారు&period;ఈ బృహత్తర లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను&comma; శ్రీసిటీని ఎంచుకున్నందుకు క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు ఆయన స్వాగతం పలికారు&period; ఈ పెట్టుబడి రాష్ట్ర డిజిటల్&comma; పారిశ్రామిక అభివృద్ధిని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అని మంత్రి లోకేష్‌ అభివర్ణించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..