తిరుపతి కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు కస రత్తులు ప్రారంభిం చారు. కనీసం 40 మంది వైసిపి కార్పో రేటర్లను కొనడానికి రంగం సిద్ధం చేసు కుంటున్నారని సమాచారం. ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టగల వారిని మేయర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆశీస్సుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. కూటమి మద్దతుతో తిరుపతి జనసేన అభ్యర్ధిగా ఆరణి శ్రీనివాసులు 61,956 మెజారిటీతో వైసిపిఅభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై విజయం సాధించారు.దీనితో నగరంలో కూటమికి తిరుగులేని ప్రజా మద్దతు ఉందని తేలిపోయింది. కాబట్టి ఎలాగైనా మేయర్ పదవిని దక్కించుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. 2021లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 50 మంది కార్పొరేటర్ల 48 మంది వైసిపి వారు గెలిచారు. టిడిపి నుంచి కార్పొరేటర్ గా ఒకరు మాత్రమే ఎన్నికయ్యారు. తిరుగులేని మెజారిటీ రావడంతో డాక్టర్ శిరీషకు యాదవ్ మేయర్ పదవి చేపట్టారు. డిప్యూటీ మేయర్లుగా ముద్రనారాయణ, భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు వైసిపికి రాజీనామా చేశారు. కొందరు కూటమి నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతను మేయర్ గా చేసి పవన్ కళ్యాణ్ కు బఘుమతిగా ఇవ్వాలని చూస్తున్నారు. అయితే టిడిపి నేతలు తమ ప్రాబల్యం కాపాడుకోవడానికి జనసేన ప్రయత్నాలకు మోకాలు అడ్డు తున్నారని అంటున్నారు.మేయర్ శిరీష మెజారిటీ కార్పొరేటర్ లను టిడిపిలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కార్పోరేషన్ చేయి జారకుండా చూసుకోవాలని వైసిపి నేతలు పట్టుగా ఉన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.