పల్నాడు జిల్లా, వినుకొండ వినాయక ఫైర్ వర్క్స్ గౌడౌన్ లో తనిఖీలు నిర్వహించిన పోలిసులు వ్యాపార లైసెన్సు, ఫైర్ లైసెన్సు, ఫైర్ పరికరాలు పరిశీలించిన సిఐ సాంబశివరావు క్రాకర్స్ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమిపంలో ఉన్న వినాయక క్రాకర్స్ గౌడౌన్ ను సిఐ సాంబశివరావు సిబ్బంది తో కలసి పరిశీలించారు… వ్యాపారానికి సంబంధించిన అనుమతి పత్రాలను, ఫైర్ లైసెన్సు, నిల్వ సామర్థ్యంను పరిశీలించారు… అగ్నిమాపక పరికరాలను పనిచేస్తున్నాయా…లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు…ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మీడియా తో మాట్లాడుతూ క్రాకర్స్ అమ్ము కోవలనుకునే వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాత్కాలిక లైసెన్సు లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారులు అందరూ జూనియర్ కళాశాల మైదానంలో అమ్ముకునే విధంగా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు… కొందరు వ్యాపారులు స్టాండర్డ్ కాని దీపావళి మందులను అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదు లు వస్తున్నాయని తెలిపారు… వ్యాపారులు అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలతో ఏవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నిర్వహించుకోవాలని కోరారు.
వినుకొండలో ఫైర్ వర్క్స్ గోడౌన్లో పోలీసుల తనిఖీలు..
100
previous post