ఎన్ ఆర్ టి సెంటర్లో ఓ వాహనం లో బిల్లులు లేకుండా రవాణా అవుతున్న వెండి వస్తువులను చిలకలూరిపేట పట్టణ సీఐ పి రమేష్ వారి సిబ్బందితో పట్టుకొన్నారు . ఇందుకు సంబంధించి వివరాలను పట్టణ సీఐ పి రమేష్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పట్టణం లోని ఎన్ ఆర్ టి సెంటర్లో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విధుల్లో భాగంగా తనీఖీలు చేయచుండగా గుజరాత్ కు చెందిన జి జె 24కె 3658 హోండా అమిజ్ వైట్ కారు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేయగా కారులో రాజస్థానుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు . ఈ వస్తువులను వాళ్లు విజయవాడ నుండి తరలిస్తున్నట్లుగా తెలిపారు . చిలకలూరిపేట పట్టణ కమర్సియల్ టాక్స్ ఆఫీసర్ మల్లికార్జున్ మాట్లాడుతూ సుమారు 36 కేజీల విలువగల వెండి సామాగ్రికి ఇన్వాయిస్ మాత్రమే ఉన్నాయి వే బిల్లు లు లేవు వీటి విలువ 23 లక్షలు ఉంటుంది . దీనికి 1. 38 లక్షల అపరాధ రుసుము వేసినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ తో ఎసి ఐ , సిబ్బంది పాల్గొన్నారు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.