Palnadu :
పల్నాడు జిల్లా బాపట్ల మండలం తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో డయేరియా(Diarrhea) ప్రబలింది. దీంతో సుమారు 60 మంది స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో బాపట్ల, కర్లపాలెం, గుంటూరులోని ప్రభుత్వ(Guntur Government), ప్రైవేటు ఆస్పత్రుల్లో(Private Hospitals) చేరారు. డయేరియాతో 5 రోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాల్లో పనులు చేసేటప్పుడు ఎండ వేడితో పాటు ఎండకు వేడెక్కిన నీరు తాగడం వల్ల విరేచనాలు అవుతున్నట్లు డాక్టర్ ఉస్మాన్(Dr Usman) తెలిపారు. మందులు వాడిన వెంటనే విరేచనాలు తగ్గుముఖం పట్టాయన్నారు. రెండు రోజుల నుంచి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 60 మందికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం వెళ్ళారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది డాక్టర్ తెలిపారు.
Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి