55
కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజీపీ మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడమే తమ పార్టీ విధానమని అన్నారు. సామాజిక సాధికారిత పేరిట బస్సు యాత్ర చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను రద్దు చేసిన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. సబ్ ప్లాన్ను కేంద్రం రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.