తిరుపతి జిల్లా పిచ్చాటూరు బస్టాండ్ వద్ద మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నినాదంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని మాజీమంత్రి చింతామోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం తుఫాన్ ప్రభావంతో మండలంలోని వరి వేరుశనగ మొదలైన పంటలు పూర్తిగా నష్టపోయాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటూ ఉంటే… జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా తిరుగుతూ నష్టపోయిన పంట పొలాలను సేకరిస్తున్నారని చెప్పడం దారుణం అన్నారు. పక్క రాష్ట్రమైన తమిళనాడులో వరద బాధితులకు 6000 చెప్పున ముఖ్యమంత్రి స్టాలిన్ చెల్లిస్తూ ఉంటే… మన ముఖ్యమంత్రి వరద బాధితులు కనీసం 6 రూపాయల కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు, జీతాలు పెంచమని అడుగుతుంటే అడ్డదిడ్డమైన దారుల్లో సచివాలయ సిబ్బందిల చేత అంగన్వాడీలను తెరిపించడం దారుణం అన్నారు. మండలాలను అభివృద్ధి బాటలు నడిపించాల్సిన మండల అధికారులు సమయానికి చేరుకోవడం లేదు మరి ఎట్లా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవదని మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు.
Read Also..