ఓఎన్జీసీ పైపులైన్ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23 వేల 458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను సీఎం విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక పోస్ట్ పోన్ చేసుకున్నామన్నారు. మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని సీఎం జగన్ పేర్కొన్నారు.
మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్
112