ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన. 25న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పి ఈ ఎస్ మెడికల్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. 3.30 నుంచి 5 గంటల వరకు పి ఈ ఎస్ ఆడిటోరియంలో చిత్తూరు జిల్లా అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటలకు వరకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. తిరిగి 26 ఉదయం గంటపాటు చిత్తూరు జిల్లా నేతలు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఉదయం 11 గంటలకు ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మద్యలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కుప్పం బూత్ లెవెల్ కమిటీ నుంచి పై స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు కుప్పం మెడికల్ కళాశాల నుంచి సీఎం చంద్రబాబునాయుడు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 78964