- బడులు తెరిచిన రోజే (జూన్ 12వ తేదీన) ఉచితంగా 4.42 కోట్ల పాఠ్య పుస్తకాలు పంపిణీ
- 1-10వ తరగతి(Class 1-10) వరకు గణితం, సామాజిక, భౌతిక, జీవ శాస్త్రం వంటి సబ్జెక్ట్ లకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్
- ప్రపంచంలోనే ద్విభాషా పాఠ్యపుస్తకాలు కలిగిన ఏకైక బోర్డుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ బోర్డు(Andhra Pradesh Board
- 3 నుండి 9వ తరగతి విద్యార్థులకు టోఫెల్ వర్క్ బుక్ లు..
- ఈ ఏడాది ఫ్యూచర్ స్కిల్స్ ను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టి సంబంధిత పుస్తకాలు 8వ తరగతి విద్యార్థులకు అందించేందుకు చర్యలు
- 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన 1-10వ తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలు పీడీఎఫ్ రూపంలో CSE.AP.GOV.IN వెబ్ సైట్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం
పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్(Praveen Prakash)
2024- 2025 విద్యా సంవత్సరానికి అవసరమైన 4.42 కోట్ల పాఠ్య పుస్తకాల(4.42 crore textbooks) ముద్రణ ప్రక్రియ దిగ్విజయంగా ప్రారంభమైందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్(Principal of Education Department) సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయానికి అంటే జూన్ 12వ తేదీ నాటికి విద్యార్థినీ విద్యార్థులకు అందించేందుకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉంచుతామన్నారు.
1 నుండి 10వ తరగతి వరకు గణితం, సామాజిక, భౌతిక, జీవ శాస్త్రం వంటి సబ్జెక్ట్ లకు సంబంధించి బైలింగువల్ (ఒకవైపు తెలుగు, మరోవైపు ఆంగ్లంలో) పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ద్విభాషా పాఠ్యపుస్తకాలు కలిగిన ఏకైక బోర్డుగా ఆంధ్రప్రదేశ్ బోర్డు నిలిచిందని ప్రవీణ్ ప్రకాష్ ఆనందం వ్యక్తం చేశారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత కూడా సైన్స్ పాఠ్యపుస్తకాన్ని ఎక్కువకాలం రిఫరెన్స్ పుస్తకంగా వినియోగించుకునేందుకు వీలుగా సంబంధిత పాఠ్యపుస్తకం కోసం ఉపయోగించిన కాగితం మిగతా వాటి కంటే భిన్నంగా ఉండటం విశేషమన్నారు.
ఇది చదవండి: కావలి ప్రజా గళం సభలో పాల్గొన్న చంద్రబాబు..
2024-2025 విద్యా సంవత్సరానికి గానూ తొలిసారిగా ఫ్యూచర్ స్కిల్స్ ను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టి 8వ తరగతి విద్యార్థులకు సంబంధిత పుస్తకాలను అందజేస్తామన్నారు. 3 నుండి 9వ తరగతి విద్యార్థులు టోఫెల్ పరీక్షలకు మరింత మెరుగ్గా సంసిద్ధమయ్యేందుకు వీలుగా వారికి టోఫెల్ వర్క్ బుక్ లు అందిస్తామన్నారు. 2023-2024 విద్యా సంవత్సరం చివరి రోజున అంటే ఏప్రిల్ 23న 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన 1 నుండి 10వ తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలు పీడీఎఫ్ రూపంలో CSE.AP.GOV.IN వెబ్ సైట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. ఇది వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించకూడదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ముద్రణాశాలకు స్వయంగా వెళ్లి పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పరిశీలించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి