పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రభుత్వ పాఠశాలలో జగన్నన్న గోరుముద్ద పథకంలో మరోసారి బయటపడ్డ కుంభకోణం…. విద్యార్థులకు అందించే రాగిపిండి , బెల్లం డేట్ కొట్టేసి ఉన్న వాటిని స్కూల్ అధికారులు వాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ జగనన్న గోరుముద్ద పిల్లలకు గోరి కడుతుందని, నాణ్యతలేని మరియు గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలను వాడి పిల్లలకు పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం దాచేపల్లి మండలంలో ఫుడ్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఎక్స్పైర్ అయిపోయిన రాగి పిండి మరియు బెల్లం ప్యాకెట్లు… ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు…. ఇలా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
జగన్నన్న గోరుముద్ద పథకంలో మరో కుంభకోణం..
104
previous post