తిరుపతి, High Tension In Chittoor Punganur
చిత్తూరు(Chittoor) పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. రాత్రి సదుం మండలం ఎర్రతివారిపల్లెలో బీసీవై పార్టీ బోడె రామచంద్ర యాదవ్ కాన్వాయ్ లో 10 వాహనాలను ధ్వంసం. రాళ్లు రువ్వి, కట్టెలతో దాడులు చేసిన దుండగులు. సదుం పోలీస్ స్టేషన్ ముందే ప్రచార రథాన్ని తగలబెట్టిన దుండగులు. సదుం మండలంలో వైసీపీ బీసీవై పార్టీ. మధ్యన కొనసాగుతున్న గొడవలు.
ఇవాళ గొడవలు జరిగిన ప్రాంతాలలో పర్యటించనున్న డీఐజీ అమ్మిరెడ్డి | DIG Ammireddy..
రాత్రి నుంచి సదుం మండలంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.
బీసీవై పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకుండానే తన అనుచరులతో దాడి చేస్తున్నారు పెద్దిరెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బోడె రామచంద్ర యాదవ్.
మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసిపి కార్యకర్తలే తమ వాహనాలు ధ్వంసం చేశారని బోడె రామచంద్ర యాదవ్ ఆగ్రహం, అవేదన.
ఓటమి భయంతోనే…
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతోనే పుంగనూరులో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. పుంగనూరు లోని గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేసుకుంటూ ఉండగా తమ అనుచరులతో తనపై, తన అనుచరుల పై దాడి చేయించి వాహనాలను ధ్వంసం చేయించి ప్రచార రథాలకు నిప్పు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు బోడె రామచంద్ర యాదవ్. గత ఐదు సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా పెద్దిరెడ్డి ఆగడాలు ఆగలేదని పోలీస్ స్టేషన్ ముందే తన ప్రచార రథాన్ని తగులబెట్టినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని ఆరోపించారు బోడే. దాదాపు 30 మందికి పైగా తన అనుచరులకు గాయాలయ్యాయని, వారందరూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, పదుల సంఖ్యలో వాహనాలను ధ్వంసం చేసి ప్రచార రథాలకు నిప్పంటించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికలలో పుంగనూరు ప్రజలు ఇవన్నీ గమనించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. నిన్న జరిగిన గొడవల కారణంగా ఇరువర్గాలపై పోలీసులు 307 కేసులను నమోదు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…