పల్నాడు జిల్లా(Palnadu),
దాచేపల్లి మండలం, తంగేడ గ్రామంలో గుడికి సంబంధించిన స్థలం శుభ్రం చేస్తుండగా బయటపడ్డ నాగమయ్య స్వామి(Lord Nagamaiah) దేవతామూర్తుల విగ్రహాలు గ్రామస్తులు వెలికి తీశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 1100 సంవత్సరాల క్రితం అణువుల మాచిరెడ్డి గారు ఇక్కడ పరిపాలన చేశారని మా పూర్వీకులు చెప్పేవారు అని గ్రామస్తులు తెలియచేసారు. వారు అప్పట్లో 101 బావులు,101 దేవాలయాలు,101 సత్రాలు కట్టించారని ప్రసిద్ధి. ఎంతో ప్రసిద్ధి గల తంగెడ గ్రామం చుట్టూ కూడా అప్పట్లో కోట నిర్మించి పరిపాలన చేశారన్నా ఆనవాళ్లు ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటివరకు 71 విగ్రహలు దొరికాయని ఇంకా 30 విగ్రహాలు ఉంటాయని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి