అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం, మేము పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల సిద్ధాంతం తోనే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లి, రాయచోటి డివిజన్ డిఎస్పి మహబూబ్ బాషా, అర్బన్ సి సుధాకర్ రెడ్డి, టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మణికంఠ గిరి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాల ధారణ ధరించిన అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ ఆకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లీ తోపాటు రాయచోటి నియోజకవర్గం టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథులుగా హాజరైన వారికి స్వామి వారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురుస్వాములు బసిరెడ్డి సురేష్ జయశంకర స్వాములను శాలువాలతో సన్మానించి పూలమాలతో సత్కరించారు. అదేవిధంగా అతిథులుగా హాజరైన వారిని కూడా అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కఠినమైన, దీక్ష నియమములతో అయ్యప్ప స్వామి మాలధారణ ధరించడం చాలా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా సోదరుల వలె కలిసి మెలగాలన్నారు. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ సాంప్రదాయ పండుగలను నిర్వహించుకోవాలన్నారు. దాతల సహకారంతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసి మాల ధారణ ధరించిన స్వాములకు వసతి సౌకర్యాలతో పాటు బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఆలయ నిర్వాహకులకు తమ పరిరక్షణ సమితి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, మీడియా కోఆర్డినేటర్ అన్వర్, అయ్యప్ప స్వాములు తదితరులు హాజరయ్యారు.
Read Also..