తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి వర్కర్స్ & హేల్పర్స్ యునియన్ అద్వర్యంలో తలపెట్టిన అంగన్ వాడి నిరవధిక సమ్మె 14 వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం చాల బాధకరం అన్నారు. అంగన్ వాడి నాయకురాలు మసృన్ బీ, చిన్నమండెం మండలం కార్యదర్శి ఉమా రాణి. 14 వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్డివో కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు సమాన పనికి సమాన వేతనం 26 వేల వేతనాన్ని అందజేయలన్నారు. అదే విధంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన మహిళల పట్ల వైసిపి నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అంగన్ వాడి తాళాలు పగల గొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు పడాల్సింది పోయి తమను తాము సమర్దించు కోవడం చాల సిగ్గు చేటన్నారు. నెల నెలకు అందని వేతనాలతో, చాలీ చాలని వేతనాలతో, అంగన్ వాడి కేంద్రాల అద్దెలు చెల్లించుకోలేక, కూరగాయలు, గ్యాస్, టి ఎ డి ఎ బిల్లులు రాకపోవడంతో అంగన్ వాడిలు ఆర్దికంగా అనేక దుర్బర దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల రానున్న రోజుల్లో అంగన్ వాడి మహిళల శక్తి ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి వర్కర్లు హేల్పర్లు పాల్గొన్నారు.
Read Also..