నాగర్ కర్నూల్ జిల్లా..
అర్ధరాత్రి నల్లమల అచ్చంపేట లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ.. ఘర్షణలో గాయపడ్డ ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు.. ఘర్షణలో గువ్వలకు మెడ పై గాయలయ్యాయంటు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్ లను తరలిస్తున్నారనే సమాచారంతో వెంబడించిన కాంగ్రెస్ నేతలు. ఆ వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు. ఘర్షణ లో టవెరా వాహనం అద్దాలు పగలగొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ. స్థానిక పోలీసులు, గువ్వల గన్ మెన్ లు, గువ్వల ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహించిన వంశీకృష్ణ. ఈ ఘటన పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరిన వంశీకృష్ణ. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు..