బతుకుదెరువు కోసం వెళ్ళిన లక్కిరెడ్డిపల్లి మండలం గుడ్ల వారి పల్లి కల్వపల్లి కవిత ను రామాపురం మండలం నల్లగుట్ట పల్లె వాసి లక్ష్మి నరసింహులు నమ్మించి అప్పులు పాలు చేశాడంటూ అన్నమయ్య జిల్లా ఎస్పి ని ఆశ్రయించిన బాధితురాలు కవిత…
బాధితురాలు కల్వపల్లి కవిత తెలిపిన కధనం ప్రకారం … కవిత ఆమె భర్త దేవేంద్ర మదన పల్లిలో కిరాణా షాప్ తో పాటు హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. అదే విధిలో శ్రీ రామ్ చిట్స్ ఫైనాన్స్ లో పని చేస్తున్న లక్ష్మి నరసింహ అనే వ్యక్తి తరచు అంగడికి వస్తూ సన్నిహితంగా ఉండేవాడు. కవిత సొంతూరు లక్కిరెడ్డి పల్లి మండలం గుడ్ల వారి పల్లి కాగా లక్ష్మీ నరసింహులు రామాపురం మండలం నల్లగుట్ట పల్లె వాసి.. లక్కిరెడ్డి పల్లి రామాపురం మండలాలు పక్కపక్కనే కావడంతో పరిచయం కాస్త పెరిగింది. భర్తకు తెలియకుండా లక్ష్మీ నరసింహులు కవిత దగ్గర డబ్బులు తీసుకొని అవసరాలకు వాడుకుంటూ మళ్లీ ఆమెకు చెల్లిస్తూ ఉండేవాడు. నరసింహులు ఎకౌంటు లో బదిలిమ్పులు ఎక్కువగా వున్నాయని కవితకు బ్యాంకులో అకౌంట్చేయించి ఆమె అకౌంట్ నందు అతనే లావాదేవీలు జరిపేవాడు. అంతేకాకుండా ఆమెతో సంబంధం లేకుండా చెక్కు బుక్కులు ఏటీఎం కార్డులు అన్నీ కూడా అతని దగ్గరే పెట్టుకొన్నాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
బ్యాంకు నందు ఆమె అవసరం ఉన్నప్పుడు ముందుగానే బ్యాంక్ ఆఫీసులతో మాట్లాడుకొని ఆమెను చూపించి పంపించేసేవాడని కవిత తెలిపింది. పని ఉందని చెప్పి నన్ను ఒక రోజు తన ఇంటికి రమ్మని తన ఫ్రెండు ద్వారా ఫోన్ చేయించాడని తరువాత నేను వెళ్ళగానే ఎండకు వచ్చావు అంటూ తెల్లని పౌడర్ కలిపి త్రాగెలా ఇబ్బందులకు గురిచేశాడని తెలిపింది. తరువాత ఏం జరిగిందో నాకు అర్థం కాలేదని బాధితురాలు తెలిపింది. మోసపోయానని తెలిసి అతని గట్టిగా మాట్లాడితే ఈ విషయాలన్నీ ఎక్కడైనా చెప్పినా బయటకు వచ్చిన మీ ఫ్యామిలీని రోడ్డుకి ఇరుస్తానని చెప్పి బెదిరిస్తూ ఉండే వాడని భయపడి అతను అడిగినప్పుడల్లా అప్పులు తెచ్చి మరి డబ్బులు ఇస్తూ వచ్చానని కవిత తెలిపింది. అప్పులు తెచ్చిన వారి నుండి అనేక ఇబ్బందులు పడుతున్నానని ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని నరసింహులను అడిగగా నేను ఇచ్చేది లేదని దిక్కున చోట చెప్పుకోకు అని బెదిరించాడని వాపోయింది.
ఇది చదవండి : టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఇంటూరి…
దీంతో సూసైడ్ చేసుకోవడం కూడా జరిగిందని కవిత చెప్పుకొచ్చింది. సూసైడ్ చేసుకోవడం గమనించిన భర్త హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో ఉన్న విషయం తెలుసుకొని భర్త దగ్గరకు వచ్చి మీ భార్య 22 లక్షల అప్పు చేసిందని చెప్పి నేను నా పేరు మీద ఉండే చేక్కులలో 25 లక్షలు డబ్బులు రాసి బ్యాంకులో వేసుకున్నాడని తర్వాత నా భర్త ఏం జరిగింది. అని విషయం తెలుసుకొని ఇంత చేసావు అంటూ నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అని పంపించేశారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కు వెళితే అక్కడ కూడా లక్ష్మీనరసింహులు నన్ను నా కుటుంబాన్ని బెదిరించారని
దీంతో ఎస్పీ గారి దగ్గరైన నాకు న్యాయం జరుగుతుందని ఎస్పీ గారిని ఆశ్రయించినట్లు కాల్వపల్లి కవిత మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి