కడప జిల్లా(Kadapa), అగస్తేశ్వర స్వామి ఆలయం…
కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చదిపిరాల్ల గ్రామంలోని అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పూజలు.. అభిషేకాలు పూజలు నిర్వహించారు. సాయంత్రం శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నారు. భక్తులందరికీ లింగోద్భవ సమయంలో మూడు పూటలా అన్న, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ శివాలయం 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడినది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ గుడిని స్వయాన అగస్తీశ్వరుడు వచ్చి ఈ దేవాలయాన్ని ప్రతిష్టించినట్లు పూర్వీకులు చెబుతారు. ఇప్పటికి కూడా ఆగష్టేశ్వర మునీశ్వరుడు అర్ధరాత్రి సమయంలో వచ్చి పూజలు నిర్వహిస్తుంటాడని సమాచారం. ఆయనతోపాటు నాగసర్పం కూడా ఇక్కడికి వస్తుందని అనుకుంటారు. శివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవము రుద్రాభిషేకము నిర్వహిస్తారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి